రణ్‌బీర్‌, దీపిక మూవీకి ఏడేళ్లు | Karan Johar Celebrates seven years of Yeh Jawaani Hai Deewani | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌, దీపిక మూవీకి ఏడేళ్లు

Published Sun, May 31 2020 4:28 PM | Last Updated on Sun, May 31 2020 4:35 PM

Karan Johar Celebrates seven years of Yeh Jawaani Hai Deewani - Sakshi

బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తారు. ఇక దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ సినీ సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే తాజాగా కరణ్‌ 2013లో తాను నిర్మించిన రొమాంటిక్ ఎంటర్‌టెయినర్ ‘యే జవానీ హై దీవానీ’ సినిమా విడుదలై నేటికి ఏడేళ్లు పూర్తైందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆ సినిమాలో నటించిన రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె, ఆదిత్య రాయ్ కపూర్, కల్కి కోచ్‌లిన్ల పాత్రలను పరిచయం చేస్తూ వచ్చే ఫొటోలతో కూడిన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. (తాప్సీ ఇంట్లో విషాదం..)

‘‘యే జవానీ హై దీవానీ’  సినిమా విడుదలై నేటికి ఏడేళ్లు అవుతోంది. సినిమాలో నటించిన ఆ నలుగురు స్నేహితుల బృందం మన జీవితాల్లోకి వచ్చి వారిలో ఉన్న స్నేహం, ప్రేమను చూపించారు. ప్రస్తుతం ఉన్న జెనరేషన్‌కు తగిన సినిమా ఇది’ అని కరణ్‌ కామెంట్‌ జత చేశారు. ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ నిర్మించగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఫీల్‌ గుడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శికుల  ప్రశంసలు అందుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement