అయ్యా... నీతులు ధనుష్‌కి చెప్పండి | Kathiresan Request to Rajinikanth in Dhanush Issue | Sakshi
Sakshi News home page

ధనుష్‌ మా కొడుకే.. రజనీకీ తెలుసు!

Published Fri, Dec 29 2017 9:59 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

Kathiresan Request to Rajinikanth in Dhanush Issue - Sakshi

సాక్షి, చెన్నై : తన ఫ్యాన్స్‌తో భేటీ అయి బిజీగా ఉన్న తలైవాకు ఊహించని ప్రశ్న ఎదురైంది. రెండు రోజుల క్రితం సమావేశంలో మాట్లాడుతూ... ఏ మనిషికైనా కుటుంబమే ముఖ్యమంటూ తన అభిమానులకు రజనీ సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనుష్‌ తండ్రినంటూ ఆ మధ్య కేసు వేసిన వ్యక్తి మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. తన కొడుకును తన దగ్గరికి పంపిచేయాలంటూ రజనీని అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. 

‘‘ధనుష్ మా కుమారుడే అనే విషయం రజనీకాంత్ కు కూడా తెలుసు. అయినా స్పందించకపోవటం దారుణం’’ అని కదిరేషన్‌ సంచలన వ్యాఖ్య చేశాడు. వేలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన కదిరేశన్‌ ఈ మేరకు రజనీకి ఓ లేఖ పంపుతున్నట్టు చెబుతూ.. మీడియాకు కూడా చూపించారు. తన భార్య మీనాక్షి తీవ్ర అనారోగ్యంతో ఉందని, తమ కుమారుడు తమకు అండగా లేడన్న దిగులుతో తాము కుంగిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ధనుష్‌ నుంచి పైసా అక్కర్లేదని.. తమకు తల్లిదండ్రులుగా అంగీకరిస్తే అంతే చాలని ఆయన అంటున్నాడు.

తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పిన రజనీ... ఇదే విషయాన్ని తమ కుమారుడు అయిన ధనుష్ కు కూడా చెప్పాలని కదిరేషన్‌ హితవు పలికాడు. ఎలాగైనా తమ వద్దకు వచ్చేలా రజనీ చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ధనుష్ తన కుమారుడేనంటూ మేలూరు కోర్టులో కదిరేశన్ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు సంబంధించి ధనుష్ స్టే తెచ్చుకుని, ఆ తర్వాత కేసు నుంచి పూర్తిగా బయటపడ్డాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement