సూర్య గుంపులో కీర్తి! | Keerthi Suresh new movie starts in next month | Sakshi
Sakshi News home page

సూర్య గుంపులో కీర్తి!

Published Mon, Oct 17 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

సూర్య గుంపులో కీర్తి!

సూర్య గుంపులో కీర్తి!

‘తానా సేంద కూట్టమ్’... విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేశారు. ‘దానంతట అదే ఏర్పడిన గుంపు’ అని ఈ టైటిల్ అర్థమట. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మించనున్నారు. ఈ గుంపులో ‘నేను శైలజ’ ఫేమ్ కీర్తీ సురేశ్ కూడా చేరారు. సూర్యాకు జోడీగా నటించనున్నారామె. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘స్పెషల్ ఛబ్బీస్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.

నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు. తమిళంలో మరో స్టార్ హీరో విజయ్ ‘భైరవ’లో కూడా కీర్తీనే హీరోయిన్. ప్రస్తుతం తెలుగులో ‘పక్కా లోకల్’ సినిమాలో నాని సరసన నటిస్తోందీ భామ. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌కి విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement