![Nani next movie with debutant director Srikanth odela - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/21/nani.jpg.webp?itok=eW8GQb01)
నాని
కథలో కొత్తదనం ఉంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి వెనకాడరు నాని. తాజాగా అలాంటి ఓ కథ సైన్ చేశారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో చేశారు శ్రీకాంత్. ఇప్పటివరకూ చేయని పాత్రను ఈ సినిమాలో నాని చేయబోతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు. శర్వానంద్‌తో ‘పడిపడి లేచె మనసు’ చిత్రాన్ని నిర్మించారు సుధాకర్. ప్రసుత్తం రానాతో ‘విరాట పర్వం’ సినిమాను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment