Rana Daggubati -Miheeka Bajaj Engagement | ఇవాళే రానా-మిహీక నిశ్చితార్థం - Sakshi Telugu
Sakshi News home page

ఇవాళే రానా-మిహీక నిశ్చితార్థం

Published Wed, May 20 2020 11:42 AM | Last Updated on Wed, May 20 2020 1:39 PM

Rana Daggubati Engagement With Miheeka Bajaj In Hyderabad - Sakshi

టాలీవుడ్‌‌ మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదారాబాద్‌కు చెందిన మిహీక బజాజ్‌‌ను కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక వీరి ప్రేమకు కూడా ఇరు కుటుంబాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు రానా తండ్రి సురేష్‌ బాబు స్పష్టం చేశాడు. హైదరాబాద్‌లో నేడు రానా-మిహీకాల నిశ్చితార్థం జరగబోతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 4 గంటలకు వీరి నిశ్చితార్థం జరగనుంది.  (రానా, మిహీక ప్రేమ చిగురించింది అక్క‌డే!)

కాగా ఇప్పటీ వరకు టాలీవుడ్‌లో‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న రానా.. మిహీక బజాజ్‌ను కొంతకాలంగా ప్రేమిస్తున్నానని చెప్ప అందరికి షాక్‌ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి రానా ప్రేమ విషయం వార్తల్లో నిలుస్తూ ఉండగానే అభిమానులకు తాజాగా తన నిశ్చితార్థం విషయం చెప్పి రానా మరోసారి షాకిచ్చాడు. కాగా హైదరాబాద్‌కు చెందిన బంటీ బజాజ్‌, సురేష్‌ బజాజ్‌ దంపతుల కుమార్తె మిహీకా బజాజ్‌. మిహీక, రానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యిందని, ఇటీవల తన ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ రానా సోషల్‌ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. (రానా పెళ్లిపై సురేష్‌ బాబు క్లారిటీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement