నువ్వు ఎలాంటి వాడివో చెప్పనా!! | Ranveer Singh Comments On His Stardom | Sakshi
Sakshi News home page

ప్రియాంక నన్ను ఆటపట్టిస్తుంది : రణ్‌వీర్‌

Published Fri, Jul 12 2019 2:13 PM | Last Updated on Fri, Jul 12 2019 2:19 PM

Ranveer Singh Comments On His Stardom - Sakshi

ముంబై : పెద్ద స్టార్‌ను అయ్యాయనే భావన తనకు ఎన్నడూ లేదని బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ అన్నాడు. ఈ కారణంగానే తనెంతో హుందాగా ప్రవర్తించగలుగుతున్నానని పేర్కొన్నాడు. శుక్రవారం ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన రణ్‌వీర్‌ పలు ప్రశ్నలకు సమాధామిచ్చాడు. ఈ సందర్భంగా.. ‘  ఇంత నిరాడంబరంగా ఎలా ఉండగలుగుతున్నావని అందరూ నన్ను అడుగుతుంటారు. నేనొక స్పెషల్‌ కేస్‌ను. నా దృష్టిలో నేనింకా స్టార్‌గా ఎదగలేదు. విజయగర్వం తలకెక్కించుకోలేదు. నాకు ఎదురైన అనుభవాలు, తిరస్కరణలు నాలో కసిని పెంచాయి. తొలి సినిమా తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. నిరాశలో ఉన్న నాకు ఓ నిర్మాత చాన్స్‌ ఇచ్చాడు. ఆరోజు నా గుండె ఆనందంతో నిండిపోయింది. నటనను ప్రేమిస్తా. డబ్బుపై నాకు వ్యామోహం లేదు. అందుకే నాలో ఏమార్పు లేదు ’ అని చెప్పుకొచ్చాడు.

ప్రియాంక ఆటపట్టిస్తుంది..
‘ఇంకో విషయం చెప్పనా నేనే కాదు కొంతమంది నటీనటులు కూడా నన్ను ఇంకా చిన్నపిల్లాడిలానే భావిస్తారు. అసలు నీలాంటి అబ్బాయి స్టార్‌ అయ్యాడంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వెలాంటి వాడివో చెప్పనా?.. ఇంతస్థాయికి ఎదిగినా.. మమ్మీ మమ్మీ నేను స్టార్‌ని అయ్యానట. చూడు వీళ్లంతా నా ఫొటోలు తీసుకుంటున్నారు అంటూ సంబరపడిపోయే మనస్తత్వం నీది అని పిగ్గీ చాప్స్‌ నన్ను ఎల్లప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటుంది అంటూ రణ్‌వీర్‌ సరదాగా సంభాషించాడు. అదే విధంగా పనిభారం పెరగటం వల్ల ఇప్పుడు అల్లరి చేసేందుకు సమయం దొరకడం లేదని.. టైం చిక్కితే మాత్రం తనను ఎవరూ ఆపలేరని నవ్వులు పూయించాడు.

కాగా ఔట్‌సైడర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రణ్‌వీర్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది నవంబరులో తన చిరకాల స్నేహితురాలు, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనేను పెళ్లాడిన రణ్‌వీర్‌ వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా ఉన్నాడు. ప్రస్తుతం 83 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ సింబా తర్వాత ప్రాజెక్టులో భాగంగా త్వరలోనే థక్త్‌ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నాడు. ఇక గూండే, బాజీరావు మస్తానీ సినిమాల్లో ప్రియాంక, రణ్‌వీర్‌ కలిసి నటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement