సినిమా షూటింగ్‌లో గాయపడ్డ హీరో
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ నటిస్తున్న 'భూమి' సినిమా షూటింగ్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో భూమి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్‌లో సంజయ్ నటిస్తుండగా ఆయన పక్క ఎముక ఫ్రాక్చర్ అయినట్టు యూనివర్గాలు తెలిపాయి. కాగా ఆయన ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ వాడి షూటింగ్ కొనసాగించాడు. నొప్పి తీవ్రం కావడంతో సంజయ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనను పరిశీలించిన వైద్యులు చిన్న ఫ్రాక్చర్ అయినట్టు ధ్రువీకరించారు. గాయం నయమయ్యే వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సంజయ్‌కు సూచించారు. ఈ నెలాఖరులో సంజయ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాడని యూనిట్ వర్గాలు తెలిపాయి.