పూర్తి స్థాయి హీరోయిజమ్! | Stylish Star Allu Arjun And Director Boyapati Srinu Movie | Sakshi
Sakshi News home page

పూర్తి స్థాయి హీరోయిజమ్!

Published Sat, Feb 21 2015 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

పూర్తి స్థాయి హీరోయిజమ్!

పూర్తి స్థాయి హీరోయిజమ్!

 బన్నీ (అల్లు అర్జున్) అంటే ఎనర్జీకి చిరునామా అని చాలామంది అంటారు. అంతెందుకు ఆయనను తన హిట్ చిత్రం ‘రేసు గుర్రం‘తో పోలిస్తే మరీ మంచిది అని బన్నీ అభిమానులు అంటారు. ఇప్పటివరకు నటించిన చిత్రాల ద్వారా బన్నీ కనబర్చిన ఎనర్జీ అలాంటిది మరి. ఆ ఎనర్జీ లెవల్స్‌కి మ్యాచ్ అయ్యే కథను దర్శకుడు బోయపాటి శ్రీను తయారు చేసుకున్నారు. ఇటీవల ఈ కథను నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వినడం ఓకే చేయడం జరిగిపోయింది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ శనివారం తెలియజేశారు.
 
 గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు వచ్చే నెల జరగనున్నాయి. ఏప్రిల్ నుంచి నిరవధికంగా షూటింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే అవుట్ అండ్ అవుట్ హీరోయిజమ్ ఉన్న కథ ఇది. మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్. అభిమానులు బన్నీని ఎలా చూడాలని కోరుకుంటారో అలాంటి ఎనర్జీ ఉన్న పాత్రతో బోయపాటి శ్రీను ఈ కథ తయారు చేశారు. ఇందులో బన్నీ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తారు.
 
 వారి వివరాలు త్వరలో తెలియజేస్తాం. తమన్ పాటలు స్వరపరుస్తారు. ఎం. రత్నం సంభాషణలు సమకూరుస్తారు’’ అని చెప్పారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ‘‘బన్నీ శారీరక భాషకు నప్పే కథ ఇది. కచ్చితంగా తెరపై కొత్త బన్నీ కనిపిస్తాడు. కథ వినగానే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అరవింద్‌గారు, బన్నీ అంగీకరించారు. ఈ చిత్రం తర్వాత యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసే చిత్రం ఉంటుంది’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement