కనిపెడితే అన్నీ ఇస్తా: త్రిష
ఆ మధ్య పెటా సంస్థకు ఆదరణ తెలిపి ఆ తరువాత జల్లికట్టు పోరాట సమయంలో వారి ఆగ్రహానికి గురైన త్రిష తన ట్విట్టర్‌ను నిలిపేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆ సమస్య సద్ధుమణగడంతో మళ్లీ ట్విట్టర్‌ను రీ ఓపెన్ చేసిన త్రిష తాజాగా ఒక సంచల ప్రకటన చేసింది. అందులో కుక్క కనిపించడం లేదు. కనిపెట్టి అప్పగించగలరు అనే ప్రకటన అందర్నీ ఆకర్షిస్తోంది. అందుకు కారణం లేక పోలేదు. ఆ ప్రకటనలో కుక్క ఫొటోను ప్రచురించడంతో దాని పేరు లుక్ అని, ఆ కుక్క సమాచారాన్ని అందించిన వారికి అన్ని రకాల బహుమతులు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా రూ. 30 వేల నగదు బహుమతి ఉంటుందని త్రిష వెల్లడించింది. ఇంతకీ కనిపించకుండా పోయిన ఆ శునకం తనదా? వేరే ఎవరి కుక్క బాధ్యతలను తనపై వేసుకుందా అన్న విషయంలో త్రిష క్లారిటీ ఇవ్వలేదు.