భైరవ విజయం | Vijay and Keerthy Suresh's Bairavaa | Sakshi
Sakshi News home page

భైరవ విజయం

Published Tue, May 2 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

భైరవ విజయం

భైరవ విజయం

తమిళ స్టార్‌ హీరో విజయ్, మలయాళ బ్యూటీ కీర్తీ సురేశ్‌ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భైరవ’. భరతన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌పై ‘దృశ్య కావ్యం’ దర్శక– నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ‘విజయ భైరవ’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘భైరవ లక్ష్యం ఏంటి? అతనికి దక్కిన విజయం ఏంటి? అనేది కథాంశం. ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రమిది. తమిళంలో ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ బాగుంది. విజయ్, కీర్తీ సురేశ్‌ల నటన ప్రేక్షకులను అలరిస్తుంది. జగపతి బాబు నటన ఈ సినిమాకే ౖహె లైట్‌. ఈ నెలాఖరులో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్, పాటలు: వెన్నెలకంటి, మాటలు: ఘంటసాల రత్నకుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement