బెంగుళూరు : ఓ జర్నలిస్టుకు కరోనా సోకడంతో అతన్ని కలిసిన నలుగురు మంత్రులు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. వీరిలో ఆ రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఈనెల 24 న కర్ణాటకకు చెందిన ఓ టీవీ వీడియో జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయన ఏప్రిల్ 21 నుంచి 24 మధ్య వివిధ శాఖల మంత్రులను కలిశారు. దీంతో వారందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, హోంమంత్రి బస్వరాజ్ బొమ్మాయి, వైద్య విద్య మంత్రి డాక్టర్ సుధాకర్, పర్యాటక శాఖ మంత్రి సిటి రవి ఉన్నారు. కోవిడ్ పరీక్షలో నెగిటివ్ అని తేలిందని, అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తామంతా క్వారంటైన్‌లోకి వెళ్తున్నామని నలుగురు మంత్రులు తెలిపారు.
(కర్ణాటకలో పరీక్షలు తక్కువే )
వీడియో జర్నలిస్టు కుటుంబ సభ్యులతో పాటు అతను సన్నిహితంగా మెలిగిన ఇతర మీడియా సంస్థల జర్నలిస్టులు సహా 40 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన ఓ జర్నలిస్టుకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో తనను తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఇప్పటివరకు 532 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారిలో 215 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్ ధాటికి రాష్ట్రలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. గురువారం వైరస్ ప్రభావితం పెద్దగా లేని ప్రాంతాల్లో కొన్ని షరతులతో పరిశ్రమలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. (మాస్కు లేదని సీఆర్‌పీఎఫ్ కమాండోను..)
Comments
Please login to add a commentAdd a comment