పార్లమెంట్ ఆవరణలో అన్నాడీఎంకే ఎంపీల నిరసన
పార్లమెంట్ ఆవరణలో అన్నాడీఎంకే ఎంపీల నిరసన
Published Thu, Oct 2 2014 7:55 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని అన్నాడీఎంకే ఎంపీలు ఆరోపించారు. జయలలితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎంపీలు ఏడు గంటలపాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగింది. అక్రమ ఆస్థుల కేసులో బెంగళూరు కోర్టు జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement