భోపాల్: మధ్యప్రదేశ్లో బింద్ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడటంతో అగ్నికి ఆహుతైనట్టు చంబల్ రేంజ్ డీఐజీ డీకే ఆర్య తెలిపారు. ఇందులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.