పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ(66) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జీ రమేశ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. త్వరలో సీఎం కానున్న వీ నారాయణ స్వామి, మాజీ ముఖ్యమంత్రులు ఎన్ రంగస్వామి, ఆర్‌వీ జానకీరామన్, ఎండీఆర్ రామచంద్రన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.