‘వారి లవ్‌ ఎఫైర్‌తో షాకయ్యా’ | Mamata Banerjee Asked Agitating Junior Doctors Across The State To Resume Work | Sakshi
Sakshi News home page

బీజేపీ, సీపీఎం దోస్తీపై దీదీ ఫైర్‌

Published Thu, Jun 13 2019 2:45 PM | Last Updated on Thu, Jun 13 2019 2:45 PM

 Mamata Banerjee Asked Agitating Junior Doctors Across The State To Resume Work - Sakshi

కోల్‌కతా : సీపీఎం సహకారంతో బీజేపీ మతరాజకీయాలకు పాల్పడుతోందని, వారి లవ్‌ ఎఫైర్‌ తనకు విస్మయం కలిగిస్తోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌లో వైద్యుల ఆందోళనకు బీజేపీ మతం రంగు పులుముతోందని ఆరోపించారు. ఆందోళన చేపట్టిన జూనియర్‌ డాక్టర్లు నాలుగు గంటల్లో విధుల్లో చేరాలని, లేనిపక్షంలో తీవ్ర చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. జూనియర్‌ డాక్టర్ల ముసుగులో బయటివ్యక్తులు నిరసనల్లో చొరబడ్డారని, ఇది బీజేపీ కుట్ర అని దీదీ అభివర్ణించారు.

జూనియర్‌ డాక్టర్లు తక్షణమే విధుల్లో చేరకుంటే వారిని హాస్టల్స్‌ నుంచి బయటకు పంపేస్తామని స్పష్టం చేశారు. వైద్యులు ఆందోళనకు దిగిన ఎస్‌ఎస్‌కేఎం మెడికల్‌ కాలేజ్‌ను గురువారం సీఎం మమతా బెనర్జీ సందర్శించి పరిస్ధితిని సమీక్షించారు. విధులు నిర్వహించని వైద్యులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. నాలుగు రోజులుగా జూనియర్‌ డాక్టర్లు విధులకు దూరంగా ఉండటం దురదృష్టకరమని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement