మధ్యప్రదేశ్లో ఓ దేవాలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 50కి చేరింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దతియా జిల్లా రతన్గఢ్ మాత దేవాలయంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం మృతుల సంఖ్యను ఐదుగానే భావించారు. కానీ, క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం జరిగిన తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరిగింది. తప్పించుకునే క్రమంలో వందలాంది మంది భక్తులు సమీపంలోని సింధ్ నది బ్రిడ్జి దిశగా పరుగులు తీశారు. కొందరు నదిలో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మధ్యప్రదేశ్ ఆలయంలో తొక్కిసలాట, 50 మంది మృతి
Published Sun, Oct 13 2013 2:28 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement