చంద్రబాబుతో మాట్లాడి.. చర్చించా
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇద్దరూ ట్విట్టర్ ద్వారా తమ సంతాపం తెలిపారు. రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి చాలా బాధపడ్డానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నానని, క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడానని, పరిస్థితిపై ఆయనతో చర్చించానని తెలిపారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పుష్కరాల ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వాళ్ల కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు కూడా మృతుల కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని, అలాగే క్షతగాత్రులకు వైద్య సాయం అందించేందుకు సాధ్యమైనంత కృషి చేయాలని ఆయన సూచించారు.
Deeply pained at the loss of lives due to stampede at Rajahmundry. My condolences to the families of the deceased & prayers with the injured
— Narendra Modi (@narendramodi) July 14, 2015
I spoke to CM @ncbn & discussed the situation with him. The State Government is working to restore normalcy.
— Narendra Modi (@narendramodi) July 14, 2015
Heartfelt condolences on the loss of lives in a stampede at Pushkarulu Ghat of Godavari River in Andhra Pradesh #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) July 14, 2015
Call upon State Govt & other agencies to provide all possible aid to bereaved families & medical assistance to injured #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) July 14, 2015