హోదాపై మరోసారి చర్చ జరగాలి | The debate should be once again on status | Sakshi
Sakshi News home page

హోదాపై మరోసారి చర్చ జరగాలి

Published Sat, Jul 2 2016 1:23 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదాపై మరోసారి చర్చ జరగాలి - Sakshi

- సీఎం చంద్రబాబుతో భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి జైట్లీ వ్యాఖ్య
హామీలను నెరవేర్చాలని కేంద్ర మంత్రులకు బాబు విన్నపం
 
 సాక్షి, న్యూఢిల్లీ: చైనా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, మధ్యాహ్నం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతిని కలసి పరామర్శించారు. అరుణ్ జైట్లీని కలసిన సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీలు పరిష్కరించాలని, రెవెన్యూ లోటు విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయంపై ప్రస్తావించగా.. నీతిఆయోగ్ రూ. 2,500 కోట్ల మేర సాయం చేయాలని సిఫారసు చేసినట్టు చంద్రబాబుకు జైట్లీ వివరించినట్టు సమాచారం.

ప్రత్యేక హోదాపై మరోసారి చర్చ జరగాలని ఆర్థిక మంత్రి చెప్పినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాకు తెలిపారు. తర్వాత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన చంద్రబాబు.. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10లో ఉన్న సంస్థల విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. మంత్రులను కలవడానికి ముందు చంద్రబాబుతో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థ నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు భేటీ అయ్యారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో చంద్రబాబు విజయవాడకు బయలుదేరారు. కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ వివరాలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాకు వివరించారు.

 చైనా అభివృద్ధి వివరించారు: సుజనా
 చైనాలో అభివృద్ధి ఎలా జరుగుతోంది అన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి జైట్లీకి వివరించారని సుజనా చెప్పారు. విభజన హామీలు ఇంకా అమలు చేయకపోతే ఏపీకి కష్టమని తెలిపామన్నారు.   హైకోర్టు విభజనను రాద్దాంతం చేయడం మంచిది కాదన్నారు.కేంద్రంలో టీడీపీకి మరో బెర్తు దక్కితే సంతోషమేనన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement