రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలలో భాగంగా పేద వితంతువులకు నెలకు రూ.1,000ల పింఛను ఇస్తున్నాయి. అయితే పిల్లలున్న వితంతువులు ఎవరూ ఈ వెయ్యి రూపాయల తోటే బతకలేరు. వీరి పిల్లలు బతుకుతెరువుకోసం సుదూర పట్టణా లకు వలసపోతున్నారు. వితంతువులు పింఛను పొందడానికి ప్రతినెలా పింఛను పంచే పోస్టాఫీసులు వీరిని స్వయంగా అక్కడకు వచ్చి తీసు కోమంటున్నాయి. అయితే వీరికి వచ్చే పింఛనులో సగం పైగా రాకపో కల ఖర్చుకే అయిపోతోంది. ఇలాకాక, కేంద్రప్రభుత్వ పద్ధతిలో ఈ లబ్ధి దారులను పోస్టాఫీసులో సేవింగ్స్ అక్కౌంటు తెరిపించి ఆ అక్కౌం టులో ప్రతి నెలా పింఛను జమచేయాలి.
సంవత్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా లబ్ధిదారు స్వయంగా పోస్టుమాస్టరు వద్ద హాజరై, బతికి ఉన్నాననే సర్టిఫికెట్‌పై సంతకం పెడితే సరిపోతుంది. వితంతువులైతే తాము తిరిగి పెళ్లి చేసుకోలేదని ప్రమాణ పత్రం ఇవ్వాలి. వయో భారంతో నడక కూడా సమస్యగా ఉన్న వితంతువు లను పింఛన్ తీసుకోవడం కోసం ప్రతినెలా పోస్టాఫీసులకు రావాలని ఆదేశించడం అమానుషం. లబ్ధిదారుల ప్రయోజనం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసి అభాగ్యుల బాధను తగ్గించాలి.
త్రిపురనేని హనుమాన్ చౌదరి కార్ఖానా, సికింద్రాబాద్
పింఛను చెల్లింపులు
Published Fri, Dec 19 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement