సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా రెండో విడత ప్రచార షెడ్యూల్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 11 వరకు వివిధ ప్రాంతాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంతో కాంగ్రెస్ నేతలు బిజీ బిజీగా ఉండనున్నారు.
రెండో విడత ప్రచార షెడ్యూల్..
♦ 30న మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడలో రోడ్ షో
♦ 31న ఉదయం మధిర నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రచారం
♦ నవంబర్ 1న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ టౌన్‌లో రోడ్ షో, మధ్యాహ్నం 2కి బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో రోడ్ షోతో పాటు బహిరంగ సభ. సాయంత్రం 5 గంటలకు ఖానాపూర్ నియోజకవర్గంలో రోడ్ షో, బహిరంగ సభ
♦ 2న ఉదయం 11 గంటలకు ఆసిఫాబాద్‌లోని జైనూర్‌లో రోడ్‌షో, బహిరంగ సభ.. మధ్యాహ్నం 2 గంటలకు ఆసిఫాబాద్ టౌన్‌లో రోడ్ షో
♦ అదే రోజు సాయంత్రం 5 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో రోడ్ షోతో పాటు బహిరంగ సభ
♦ 3న కాగజ్‌నగర్ నుంచి తుమ్మడిహెట్టి ప్రాజెక్టు పరిశీలన.. 11గంటలకు బెల్లంపల్లిలో రోడ్ షోతో పాటు అక్కడి కాలనీల్లో ప్రచారం
♦ 4న ఉదయం 10.30 గంటలకు మందమర్రిలో బహిరంగ సభ.. సాయంత్రం 4.30 గంటలకు చెన్నూర్‌లోని రామకృష్ణాపురంలో రోడ్ షోతో పాటు కాలనీల్లో ప్రచారం.. రాత్రి 7.30 గంటలకు మంచిర్యాలలో బహిరంగ సభ
♦ 5న ఉదయం 11 గంటలకు పాలేరులో రోడ్ షోతోపాటు కాలనీల్లో ప్రచారం.. అనంతరం కూసుమంచిలో రోడ్ షో.. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం హెడ్‌క్వార్టర్‌లో రోడ్‌షో, ప్రచారం
♦ 6న ప్రచారానికి విరామం
♦7న మధిరలోని బోనకల్‌లో 11గంటలకు బహిరంగ సభ.. మధ్యాహ్నం 3 గంటలకు వైరా నియోజకవర్గంలో రోడ్ షోతో పాటు బహిరంగ సభ.. రాత్రి 7 గంటలకు కల్లూరు, సత్తుపల్లిలో రోడ్ షో, అక్కడి కాలనీల్లో ప్రచారం
♦ 8న ఉదయం 11 గంటలకు అశ్వారావుపేటలో రోడ్ షో.. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెంలో బహిరంగ సభ.. సాయంత్రం 5 గంటలకు ఇల్లందులో రోడ్ షో, కాలనీల్లో ప్రచారం
♦ నవంబర్ 9, 10 తేదీల్లో ప్రచారానికి విరామం
♦ 11న భద్రాచలంలో రోడ్ షో, కాలనీల్లో ఇంటింటి ప్రచారం.. మధ్యాహ్నం పినపాకలో రోడ్ షో, కాలనీల్లో ప్రచారం
ప్రచార కోఆర్డినేటర్ల నియామకం...
రెండో విడత ప్రచారానికి ఆయా ప్రాంతాల్లో ప్రచార కమిటీతో సమన్వయం చేసుకునేందుకు ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ప్రాంతాల వారీగా కో ఆర్డినేటర్లను నియమించారు.
ఎన్‌ఆర్‌ఐ ప్రచార సబ్‌కమిటీ నియామకం...
ప్రవాసాంధ్రులను కూడా ప్రచార కమిటీలో భాగం చేస్తూ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కమిటీకి డాక్టర్ వినోద్‌కుమార్ నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఆస్ట్రేలియా ఎన్‌ఆర్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, అమెరికా ఎన్‌ఆర్‌ఐలు రాయదాస్‌రాయ్ మంతెన, జమిలీ మహ్మద్, రామ్మోహన్ కపిల, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, యూకే ఎన్‌ఆర్‌ఐ గంప వేణుగోపాల్, సుధాకర్ గౌడ్, గల్ఫ్ తరఫున నంగి దేవేందర్‌రెడ్డి, ఎం.భీంరెడ్డి కమిటీ సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రచార జోరు!
Published Mon, Oct 29 2018 2:50 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment