![Words Of War Between TDP vs TDP Leaders In YSR Kadapa - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/1/kadapa-ntr-circle.jpg.webp?itok=RB0JPb27)
ఎన్టీఆర్ కూడలి
సాక్షి, వైఎస్సార్ కడప : జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కడప టీడీపీ నాయకుల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వర్గం, కడప నియోజకవర్గ ఇంచార్జి అష్రఫ్ వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన తెలిపే క్రమంలో నగరంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద టీడీపీ శ్రేణులు పోగవగా.. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు తమ నోళ్లకు పనిచెప్పారు. నిరసన కార్యక్రమానికి ఎందుకు పిలవలేదని అష్రఫ్, శ్రీనివాసులురెడ్డి వర్గాలవారు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment