సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల మీదే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన పరి ణామాలను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, అదే సమయంలో 2024 ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని ప్రకటనలో వివరించింది.
ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: వైఎస్సార్‌సీపీ
Published Sun, Nov 11 2018 2:34 AM | Last Updated on Sun, Nov 11 2018 4:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment