కింబర్లీ రోడ్ కొత్త చరిత్ర | American shooter Kim Rhode makes history with bronze medal win | Sakshi
Sakshi News home page

కింబర్లీ రోడ్ కొత్త చరిత్ర

Published Sun, Aug 14 2016 1:55 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

కింబర్లీ రోడ్ కొత్త చరిత్ర - Sakshi

కింబర్లీ రోడ్ కొత్త చరిత్ర

ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడమే కాకుండా అన్నింట్లోనూ పతకాలు నెగ్గి అమెరికా మహిళా షూటర్ కింబర్లీ సుసాన్ రోడ్ కొత్త చరిత్ర సృష్టించింది. అటు పురుషుల్లో గాని... ఇటు మహిళల్లోగాని సమ్మర్ ఒలింపిక్స్ చరిత్రలో వ్యక్తిగత విభాగంలో వరుసగా ఆరు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది.

వింటర్ ఒలింపిక్స్‌లో అర్మీన్ జొయెగ్లర్ (ఇటలీ) లూజ్ క్రీడాంశంలో మాత్రమే వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో (1994 నుంచి 2014) పతకాలు సాధించాడు. శుక్రవారం రాత్రి ముగిసిన మహిళల షూటింగ్ స్కీట్ ఈవెంట్‌లో 37 ఏళ్ల రోడ్ కాంస్య పతకాన్ని సాధించింది.  ఐదు వేర్వేరు ఖండాల్లో ఒలింపిక్ పతకాలు నెగ్గిన తొలి ప్లేయర్‌గా కూడా కింబర్లీ రోడ్ గుర్తింపు పొందింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటానని, అక్కడా పతకం గెలుస్తానని రోడ్ వ్యాఖ్యానించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement