రెబల్ లీగ్‌కు ‘ఎసెల్’ సై! | Another new league in cricket | Sakshi
Sakshi News home page

రెబల్ లీగ్‌కు ‘ఎసెల్’ సై!

Published Fri, May 8 2015 1:34 AM | Last Updated on Tue, Jun 4 2019 6:34 PM

Another new league in cricket

అధికారికంగా ఖరారు చేసిన సంస్థ  ముందుగా భారత్‌లో దేశవాళీ టోర్నీ
 
సిడ్నీ: ఐపీఎల్‌కు పోటీగా ప్రపంచ క్రికెట్‌లో మరో కొత్త లీగ్ రాకకు రంగం సిద్ధమైంది. గతంలో ఐసీఎల్ నిర్వహించిన ‘జీ’ సంస్థ అధినేత సుభాష్ చంద్ర మరోసారి దీనికి శ్రీకారం చుడుతున్నారు. గత రెండు వారాలుగా దీనిపై పలు వార్తలు వచ్చినా దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రిక కథనం ప్రకారం రెబల్ లీగ్ విషయాన్ని ఎసెల్ గ్రూప్ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ హెడ్ హిమాంశు మోదీ నిర్ధారించారు.

ఈ టి20 లీగ్‌ను ముందుగా భారత్‌లోని వివిధ నగరాలలో నిర్వహించనున్నట్లు సమాచారం. గతంలో విఫల ప్రయత్నంగా మిగిలిన ఐసీఎల్ తరహాలో కాకుండా...ఈ సారి విజయవంతం చేసేందుకు మరిన్ని జాగ్రత్తలతో లీగ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. ఐపీఎల్‌కు పోటీగా ప్రముఖ క్రికెటర్లతో పాటు యువ ఆటగాళ్లను కూడా ఈ లీగ్ ఆకర్షించనుంది. క్రికెటర్లకు ఆర్థికపరమైన భద్రత ముందే కల్పిస్తూ, వారిని ఒప్పించడం కోసం ముందే బ్యాంక్ గ్యారంటీలు కూడా ఇవ్వాలని ‘ఎసెల్’ ప్రతిపాదిస్తోంది. ఐపీఎల్‌కు దూరంగా ఉన్న పాక్ క్రికెటర్లను కూడా లీగ్‌లో చేర్చాలని భావిస్తున్న నిర్వాహకులు, ఏడాదిలోగా దీనిని ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement