ఏసెస్ శుభారంభం | ASS team good start | Sakshi
Sakshi News home page

ఏసెస్ శుభారంభం

Published Tue, Nov 18 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

ఏసెస్ శుభారంభం

ఏసెస్ శుభారంభం

సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 27-25 గేమ్‌ల (3-2 మ్యాచ్‌ల) తేడాతో బెంగళూరు రాఫ్టర్స్‌ను ఓడించింది. మంగళవారం ఇక్కడే జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పుణేను ఎదుర్కొంటుంది.

 హింగిస్ జోరు: మార్టినా హింగిస్, వీనస్ విలియమ్స్ మధ్య జరిగిన సింగిల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు మాజీ చాంపియన్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్‌లో హింగిస్ 6-3తో గెలుపొందింది. ముందుగా 3-2తో ఆధిక్యంలో నిలిచిన హింగిస్, ఆరో గేమ్‌ను బ్రేక్ చేసి దూసుకుపోయింది. చివరకు తొమ్మిదో గేమ్‌ను నిలబెట్టుకొని మ్యాచ్ సొంతం చేసుకుంది.

అంతకు ముందు లెజెండ్స్ మ్యాచ్‌లో మార్క్ ఫిలిప్పోసిస్ 6-5 (5-2)తో థామస్ ఎన్‌క్విస్ట్‌ను ఓడించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో బెంగళూరు జోడి వీనస్ విలియమ్స్-ఫెలీసియానో లోపెజ్ 6-5 (5-1)తో మార్టినా హింగిస్- మిఖాయిల్ యూజ్నీపై విజయం సాధించి పోరును సమం చేశారు. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన యూజ్నీ-జీవన్ నెడుంజెళియన్ 6-3తో బెంగళూరు జంట లోపెజ్-రాంకుమార్ రామనాథన్‌ను ఓడించింది.  చివరి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో యూజ్నీ (హైదరాబాద్) 4-8తో లోపెజ్ చేతిలో ఓడాడు.

 ఢిల్లీ విజయం: న్యూఢిల్లీలో జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ డ్రీమ్స్ జట్టు 25-19తో పంజాబ్ మార్షల్స్‌పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement