భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం బెంగళూరులో జరుగుతున్న చిట్టచివరి మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ సందర్భంగా కమాండోలు సహా 1200 మంది పోలీసు బలగాలను మోహరించామని, స్టేడియం చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నామని బెంగళూరు అదనపు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. అలాగే, వాహనాల రాకపోకలను నియంత్రించడానికి కూడా 600 మంది కానిస్టేబుళ్లను నియమించారు.
కేవలం పోలీసు సిబ్బందినే కాక, కుట్రలు ఛేదించే ప్రత్యేక నిపుణులను, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ మోహరించామని పంత్ చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేడియానికి ఒక కిలోమీటరు పరిధిలోపు ఎక్కడా వాహనాలను పార్కింగ్ చేయకుండా నిషేధించామన్నారు. ముఖ్యమైన పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, క్యారీ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలు స్టేడియంలోకి తేవడానికి అనుమతించబోమని పంత్ చెప్పారు.
ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా: బెంగళూరు వన్డేకు భారీ భద్రత
Published Sat, Nov 2 2013 1:11 PM | Last Updated on Sat, Sep 2 2017 12:14 AM
Advertisement
Advertisement