జవాన్లతో భారత క్రికెటర్లు
ఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు, బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీలో టెర్రిరోయల్ ఆర్మీ జవాన్లను కలిశారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ బృందం జవాన్లతో ముచ్చటించింది. కొందరు క్రికెటర్లు ఆయుధాలను పరిశీలించారు. జవాన్లతో కలసి ఫొటోలు దిగారు.
గురువారం ఢిల్లీలో న్యూజిలాండ్తో జరిగే రెండో వన్డేలో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు వెళ్లింది. బుధవారం బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్.. క్రికెటర్లను తీసుకుని టెర్రిటోరియల్ ఆర్మీ కార్యాలయానికి వెళ్లారు. టెర్రిటోరియల్ ఆర్మీ (టీఏ)లో ఠాగూర్ రెగ్యులర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మిలటరీ దళంలో చేరిన తొలి బీజేపీ ఎంపీ ఆయనే కావడం విశేషం.