ధోని- కోహ్లిల పేర్లతో రెస్టారెంట్‌.. | Business man open restaurant on Dhoni -kohli name in mumbai | Sakshi
Sakshi News home page

ధోని- కోహ్లిల పేర్లతో రెస్టారెంట్‌..

Published Thu, Oct 19 2017 7:56 PM | Last Updated on Thu, Oct 19 2017 11:13 PM

Business man open restaurant on Dhoni -kohli name in mumbai

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ‘కోహ్లి- ధోని’ల పేరిట రెస్టారెంట్‌ వెలిసింది.  టీం ఇండియా స్టార్‌ ఆటగాళ్లు అయినా ధోని, కోహ్లి పేరును క్యాష్‌ చేసుకునేందుకు ఈ పేరు పెట్టినట్లు తెలుస్తుంది. వారిద్దరూ కలిసి రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంబించారు అని ఆలోచిస్తున్నారా.. వారిది కాదండోయ్‌. ధోని, కోహ్లి మీద అభిమానంతో ఓ వ్యాపారి  వాళ్ల పేరుతో రెస్టారెంట్‌ ఓపెన్‌ చేశారు.

ఈ రెస్టారెంట్‌ ముంబైలోని కాండీవలి ఈస్ట్‌ ప్రాంతంలో ఉంది.  వారికి ఉన్న క్రేజ్‌ను రెస్టారెంట్‌ ఓనర్స్‌ ఈ విధంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రెస్టారెంట్కు సంబంధించిన ఫోటోలను క్రికెట్‌ విశ్లేషకుడు మోహన్‌దాష్ మేనన్‌ తన ట్విట్టర్‌ ద్వారా పోస్టు చేశాడు.

ధోని, కోహ్లిలకు ఈ రెస్టారెంట్‌తో ఏ విధమైన సంబంధం లేదు. అభిమానులను ఆకర్షించటానికి వారు వీరి పేర్లను పెట్టారు. ప్రస్తుతం ఇండియా సారథి విరాట్‌ కోహ్లి, ధోనిలు న్యూజిలాండ్‌ జరిగే వన్డే సిరీస్‌  కోసం సాధన చేస్తున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్‌ అక్టోబర్‌ 22న తొలి వన్డే జరగనుంది.  ఆదివారం జరిగే మ్యాచ్‌ కోహ్లికి 200వ వన్డే కావడం విశేషం.



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement