వార్నర్‌కు రెండో అమ్మాయి...
సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌కు మళ్లీ కూతురు పుట్టింది. ఆమెకు ఇండీ రే అని పేరు పెట్టాడు. గురువారం ఉదయం భార్య క్యాండిస్, చిన్నారితో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పెట్టి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘నేను, క్యాండిస్ కలిసి అందమైన పాపకు ఈ ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్నాం. మమ్మీ, డాడీ చాలా సంతోషంగా ఉన్నారు’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. వార్నర్‌కు ఇప్పటికే 16 నెలల వయసు ఉన్న ఇవీ మే అనే అమ్మాయి ఉంది.