ఆ జట్టును చిత్తు చిత్తుగా ఓడిస్తాం.. | England can whitewash Sri Lanka, says Anderson | Sakshi
Sakshi News home page

ఆ జట్టును చిత్తు చిత్తుగా ఓడిస్తాం..

Published Tue, May 10 2016 4:47 PM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

ఆ జట్టును చిత్తు చిత్తుగా ఓడిస్తాం..

ఆ జట్టును చిత్తు చిత్తుగా ఓడిస్తాం..

లండన్: త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్ లో శ్రీలంక జట్టును ఇంగ్లండ్ వైట్ వాష్ చేస్తుందని ఆ జట్టు పేసర్ జేమ్స్ అండర్సన్ పేర్కొన్నాడు. మే 19 నుంచి ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై అప్పుడే కామెంట్లు మొదలుపెట్టాడు జేమీ. గత జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో 2-1తో గెలిచిన విషయాన్ని గుర్తుచేశాడు. ఇప్పుడు మాత్రం అలాకాదని, కచ్చితంగా శ్రీలంకను చిత్తుచేసి 3-0తో క్లీన్ స్వీస్ చేస్తామంటున్నాడు.

కుమార సంగక్కర, మహేళ జయవర్దనే లాంటి దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత లంక బలహీన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లంకపై సిరీస్ ఉండటం తమకు బాగా కలిసొస్తుందన్నాడు. రెండేళ్ల కిందట స్వదేశంలో లంకపై 1-0తో ఓటమి పాలయ్యామని అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని అండర్సన్ అభిప్రాయపడ్డాడు. ఆ టెస్ట్ డ్రా అవుతుందనుకోగా,  చివరి వికెట్ గా తాను అవుటవ్వడం చాలా చెత్త సంఘటనగా ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement