కేప్‌టౌన్: కెప్టెన్ డు ప్లెసిస్ (103; 13 ఫోర్లు) సెంచరీకి తోడు బవుమా (75; 10 ఫోర్లు) డికాక్ (55 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధశతకాలు సాధించడంతో పాకిస్తాన్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 382 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 123/2తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టు ఆరంభంలోనే ఆమ్లా (24), డిబ్రుయిన్ (13) వికెట్లు కోల్పోయి 149/4తో నిలిచింది.
ఈ దశలో డు ప్లెసిస్, బవుమా పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 156 పరుగులు జతచేశాక బవుమా వెనుదిరిగాడు. చివర్లో డికాక్ ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా 205 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది 3 వికెట్లు పడగొట్టాడు.
డు ప్లెసిస్ సెంచరీ
Published Sat, Jan 5 2019 1:18 AM | Last Updated on Sat, Jan 5 2019 1:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment