హఫీజ్
ఆబుదాబి: పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 302 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ చివరి రోజు శనివారం ఆట ముగిసే సరికి తమ రెండో ఇన్నిం గ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. హఫీజ్ (136 బంతుల్లో 80 నాటౌట్; 11 ఫోర్లు), షహజాద్ (109 బంతుల్లో 55; 7 ఫోర్లు) రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించి మ్యాచ్‌ను డ్రా దిశగా నడిపించారు.
అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 420/5 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక మరో 60 పరుగులు జోడించింది. మాథ్యూస్ (343 బంతుల్లో 157 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్), ప్రసన్న జయవర్ధనే (169 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్‌కు అభేద్యంగా 156 పరుగులు జోడించడంతో 480/5 వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి పాక్‌కు 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ రాణించిన మాథ్యూస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.