హాంకాంగ్ క్రికెటర్‌పై తాత్కాలిక నిషేధం
హాంకాంగ్: ఐసీసీ అవినీతి వ్యతిరేక కోడ్‌ను ఉల్లంఘించినందుకు హాంకాంగ్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పాక్ మాజీ క్రికెటర్ నసీమ్ గుల్జార్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం గతంలో ఇర్ఫాన్‌ను సంప్రదించాడు. అయితే ఈ ఆఫర్‌ను తను తిరస్కరించినా విషయాన్ని మాత్రం ఐసీసీ ఏసీయూ అధికారులకు చేరవేయలేదు. దీంతో ఐసీసీ ఈ 26 ఏళ్ల ఆటగాడిపై తాత్కాలిక నిషేధం విధించింది. విచారణలో దోషిగా తేలితే రెండు నుంచి ఐదేళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది.
భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో ఆడే హాంకాంగ్ జట్టులో ఇర్ఫాన్ కూడా ఉన్నాడు. అయితే ఈ విషయంలో ఐసీసీతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఇర్ఫాన్ లాయర్ కెవిన్ ఈగన్ అన్నారు. మరోవైపు ఇర్ఫాన్ ఉదంతం ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాల ఆటగాళ్లకు హెచ్చరికలాంటిదని హాంకాంగ్ క్రికెట్ సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కట్లర్ అన్నారు.