భారత్ లక్ష్యం 171
సాక్షి, కొలంబో: ఏకైక టీ20లో శ్రీలంక భారత్‌కు171 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. దిల్షాన్ మునవీర 53(29 ), అషాన్ ప్రియంజన్ 40(40) రాణించడంతో 170 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కోహ్లీ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్ ఉపుల్ తరంగ (5) వద్ద భువనేశ్వర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 23 పరుగులకే మరో ఓపెనర్ డిక్వెలా 17(14)ను బుమ్రా బోల్తా కొట్టించాడు.
ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోర్లకే ఔటైనా శ్రీలంక పరుగుల వరద పారించింది. అరంగేట్రం బ్యాట్స్‌మన్ దిల్షాన్ మునవీర 53(29) హాఫ్ సెంచరీ చేశాడు. ఓ ఎండ్‌లో వికెట్టు పడుతున్న మునవీర మాత్రం బౌలర్లను ఆటాడుకున్నాడు. 99 పరుగుల వద్ద మునవీరను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించడంతో రన్ రేట్ పడిపోయింది.
ధోని మరోసారి అద్భుత స్టంపింగ్ చేశాడు. ఏంజెలో మాథ్యూస్ (7)ను మిల్లీమీటర్ తేడాతో స్టంపింగ్ చేసి అబ్బురపరిచాడు. 113 పరుగుల వద్ద పెరీరా (11), శనక (0)ను చాహల్ ఔట్ చేయడంతో ఆట భారత్ చేతిలోకి వచ్చినా అషాన్ ప్రియంజన్ (40) రెండు సిక్సర్లు బాది మెరవడంతో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బౌలర్లు చాహాల్‌కు 3వికెట్లు దక్కగా కులదీప్ యాద్‌వ్‌కు 2, భువనేశ్వర్, బుమ్రాలు చెరో వికెట్ తీశారు.