సెంచూరియన్ : భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగాల్సిన రెండో టీ20 జరగడం కష్టంగా కనిపిస్తోంది. సెంచూరియన్ వేదికగా సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో రాత్రి 9.45 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యమమ్యే అవకాశం ఉంది. భారీ వర్షం కురుస్తుండటంతో మైదానమంతా కవర్లు కప్పేశారు. అయితే అక్కడక్కడ అవుట్ ఫీల్డ్‌ను వదిలేశారు. దీంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వర్షం ఇలానే కొనసాగితే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది.
వర్షంతో నిలిచిపోయిన మహిళల టీ20 మ్యాచ్
ఇక ఇదే మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా నాలుగో టీ20 జరుగుతున్న విషయం తెలిసిందే. వీరి ఆట మధ్యలోనే వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు మ్యాచ్ నిలిచే సమయానికి 15.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.
ఓపెనర్లు కెప్టెన్ నికెర్క్(55: 47 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు), లిజెల్లే లీ(59: 39 బంతులు,2ఫోర్లు, 5 సిక్సర్లు, నౌటౌట్)లు చెలరేగడంతో ప్రోటీస్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. క్రీజులో లిజెల్లే లీ(59), డూప్రీజ్(2)లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment