కత్రినా, జాక్వలిన్ షో | IPL 2016 Opening Ceremony: Katrina Kaif, Jacqueline Fernandez to groove with Chris Brown, Yo Yo Honey Singh and Ranveer Singh at NSCI SVP Stadium! | Sakshi
Sakshi News home page

కత్రినా, జాక్వలిన్ షో

Published Fri, Apr 8 2016 8:31 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

కత్రినా, జాక్వలిన్ షో

కత్రినా, జాక్వలిన్ షో

బ్రేవో ‘చాంపియన్’ ఆటాపాటా
 
ఐపీఎల్ ప్రారంభోత్సవ
కార్యక్రమం  రా. 7.30 గంటలనుంచి
సోనీ మ్యాక్స్/సోనీ సిక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం


ముంబై: బాలీవుడ్ సంగీతం మొదలు హాలీవుడ్ పాప్ మ్యూజిక్‌తో ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమం హోరెత్తనుంది. నేడు (శుక్రవారం) ఇక్కడి నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని ‘డోమ్’లో ఈ వేడుకలు జరుగుతాయి. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, హీరోయిన్లు కత్రినా కైఫ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఇండి పాప్ గాయకుడు యోయో హనీసింగ్ కూడా తన పాటలతో అలరించనున్నాడు. వీరికి తోడు అమెరికన్ సింగర్ క్రిస్ బ్రౌన్, ప్రఖ్యాత బృందం మేజర్ లాజర్ కూడా ఈ ప్రదర్శనలో భాగం కానున్నారు.


వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో తాను పాడి, స్వరపర్చిన ‘చాంపియన్’ పాటను తొలిసారి వేదికపై ప్రదర్శించనుండటం విశేషం. దీనిని ప్రత్యక్షంగా తిలకించేందుకు రూ. 10 వేలు టికెట్‌గా నిర్ణయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ‘ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ ప్రతిజ్ఞ చేసేందుకు ఐపీఎల్‌లోని ఎనిమిది జట్ల కెప్టెన్లు హాజరవుతారని బీసీసీఐ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement