రాణించిన డివిలియర్స్
మొహాలి: ఐపీఎల్-9లో భాగంగా సోమవారమిక్కడ కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయి 175 పరుగులు సాధించింది. ఓపెనర్లు విరాట్ కొహ్లీ( 21 బంతుల్లో 20) కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా.. కేఎల్ రాహుల్(25 బంతుల్లో 42) వేగంగా ఆడి తొలుత బెంగళూరుకు శుభారంబాన్నిచ్చాడు. అనంతరం ఏబీ డివిలియర్స్ కేవలం 35 బంతుల్లోనే 64 పరుగులు సాధించడంతో బెంగళూరు బారీ స్కోరు దిశగా కదిలింది. చివర్లో సచిన్ బేబి(29 బంతుల్లో 33 పరుగులు) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, కరియప్పలకు రెండేసి వికెట్లు దక్కగా.. ఏఆర్ పాటిల్కు ఒక వికెట్ దక్కింది.
తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుసగా విఫలమవుతున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ ను తొలగించారు. అతడి స్థానంలో బెహరిద్దీన్ జట్టులోకి వచ్చాడు. గురుకీరత్ సింగ్ స్థానంలో అనురీత్ సింగ్ ను తీసుకున్నారు.