న్యూజిలాండ్ ఆశలు సజీవం | McCullum steers NZ's best World T20 chase | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ ఆశలు సజీవం

Published Sun, Mar 30 2014 1:37 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

న్యూజిలాండ్ ఆశలు సజీవం - Sakshi

న్యూజిలాండ్ ఆశలు సజీవం

కీలక మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపు
 రాణించిన మెకల్లమ్
 
 చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది. శనివారం చిట్టగాంగ్‌లో జరిగిన సూపర్-10 గ్రూప్ ‘1’ మ్యాచ్‌లో కివీస్ 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తొలుత నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కెప్టెన్ బోరెన్ (35 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్సర్), టామ్ కూపర్ (23 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన న్యూజి లాండ్, కెప్టెన్ మెకల్లమ్ అద్భుతమైన బ్యాటింగ్ (45 బంతుల్లో 65; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
 
 మెకల్లమ్ అదుర్స్...
 లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 14 పరుగులకే గుప్టిల్ (9) వికెట్‌ను చేజార్చుకుంది. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన మెకల్లమ్ మొదట విలియమ్సన్ (29)తో...ఆ తర్వాత అండర్సన్ (20 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివరి ఆరు ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన తరుణంలో మెకల్లమ్ చెలరేగిపోయాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మెకల్లమ్ ఈ మ్యాచ్‌తో టి20ల్లో మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. అర్ధ సెంచరీతో రాణించిన మెకల్లమ్ టి20 కెరీర్‌లో 2వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా అతడు రికార్డుల్లోకి ఎక్కాడు.
 
 సంక్షిప్త స్కోర్లు: నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: 151/4 (20 ఓవర్లలో) (బోరెన్ 49, కూపర్ 40 నాటౌట్, నాథన్ మెకల్లమ్ 1/20); న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 152/4 (19 ఓవర్లలో) (బ్రెండన్ మెకల్లమ్ 65).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement