న్యూఢిల్లీ: వచ్చే వరల్డ్ కప్ జట్టులో ఎంఎస్ ధోని ఉండాలని యాజమాన్యం భావిస్తే అతను ఆటతీరు మార్చుకోక తప్పదని మాజీ కెప్టెన్ గంగూలీ సూచించాడు. ఏడాదిగా పరిమిత ఓవర్లలో ధోని రాణించలేకపోవడాన్ని గంగూలీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
‘2019 ప్రపంచ కప్‌లోనూ ఎంఎస్ ధోని ఆడాలని మేనేజ్‌మెంట్ అనుకుంటే అతడు సత్తా చూపే స్థానంలోనే ఆడించాలి. 24-25 ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన తరుణంలో అతడు విఫలమవుతున్నాడు. ధోని గొప్ప బ్యాట్స్‌మన్. కానీ ఏడాదిగా అతడు రాణించలేకపోతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఆటలో లోపాలను సరిచేసుకోవాల్సిన అవసరముంది’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇక, కేఎల్ రాహుల్, అజింక్యా రహానేలను జట్టు ఉపయోగించుకోవడం లేదని దాదా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకనైనా వాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడంపై దృష్టి సారించాలన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment