చివరి టెస్టులో పాకిస్తాన్ చిత్తు
హామిల్టన్: పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరిదైన రెండో టెస్టులో కివీస్ 138 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. 369 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మంగళవారం తమ రెండో ఇన్నింగ్‌సలో 92.1 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌట్ అరుు్యంది. 1985 అనంతరం పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ గెలవడం కివీస్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.
ఓపెనర్లు సమీ అస్లామ్ (238 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), అజహర్ అలీ (161 బంతుల్లో 58; 4 ఫోర్లు) అద్భుత ఆటతీరుతో తొలి వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. టీ విరామానికి వికెట్ నష్టానికి 158 పరుగులతో పాక్ పటిష్టంగానే కనిపించింది. అప్పటికి 204 బంతుల్లో 211 పరుగులు చేయాల్సి ఉంది. అరుుతే కివీస్ బౌలర్ల ధాటికి పాక్ ఇన్నింగ్‌స అనూహ్యంగా కుప్పకూలింది. చివరి 8 వికెట్లను కేవలం 49 పరుగుల వ్యవధిలోనే కోల్పోరుు పరాజయం పాలైంది. వాగ్నర్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే ఆఖరి మూడు వికెట్లు తీశాడు. సౌతీ, సాన్‌ట్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కారుు.