ముంబై: రంజీ ట్రోఫీలో ముంబైపై సంచలన విజయం సాధించిన జమ్మూ కశ్మీర్ జట్టును... బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. గురువారం ఉదయం వాంఖడే స్టేడియానికి వచ్చిన మాస్టర్ దాదాపు గంటపాటు జట్టుతో గడిపాడని జమ్మూ కశ్మీర్ టీమ్ మీడియా మేనేజర్ షహానా ఫాతిమా తెలిపారు.
‘జట్టులోని ప్రతి సభ్యుడ్ని సచిన్ అభినందించాడు. ఈ విజయాన్ని అంత తేలికగా మర్చిపోకుండా మరింత బాగా కష్టపడాలని సూచించాడు’ అని షహానా పేర్కొన్నారు. ముంబై జట్టును ఓదార్చడానికి సచిన్ బుధవారమే వాంఖడేకు వచ్చినా... జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లు సంబరాల్లో ఉండటంతో కలవకుండా వెళ్లిపోయాడు.
జమ్మూ కశ్మీర్ జట్టుకు సచిన్ అభినందన
Published Fri, Dec 12 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement
Advertisement