న్యూఢిల్లీ : ధోని, కోహ్లిల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా బాగుంది... ఇటీవల భారత జట్టులో ప్రతీ సభ్యుడు దాదాపుగా ఇదే వివరణ ఇస్తున్నాడు. ఇప్పుడు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కూడా ఈ విషయంలో గట్టిగానే స్పందించారు. ‘ఇటీవల నేను వింటూ వస్తున్న వార్త నిజం కాదు. ధోని, కోహ్లిల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. వారిద్దరికి ఒకరంటే మరొకరికి గౌరవం ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. వారిద్దరి మధ్య చక్కటి సంబంధాలు ఉన్నాయని, గత ఏడాది కాలంలో భారత్ 70 శాతంకు పైగా విజయాలు సాధించడమే దానికి ఉదాహరణ అని ఆయన గుర్తు చేశారు.
ధోనిని ఆల్‌టైమ్ దిగ్గజంగా పేర్కొన్న రవిశాస్త్రి, కెప్టెన్‌గా నిలదొక్కుకునేందుకు కోహ్లికి మరికొంత సమయం ఇవ్వాలని అన్నారు. తాను టీమ్ డెరైక్టర్‌గా కొనసాగుతూ, మధ్యలో వ్యాఖ్యాతగా వ్యవహరించడం పరస్పర విరుద్ధ సంఘర్షణ కిందకు రాదని ఆయన స్పష్టం చేశారు.
జట్టులో విభేదాలు లేవు: రవిశాస్త్రి
Published Wed, Jul 1 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM
Advertisement