కేప్‌టౌన్: భారత్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నలుగురు సీమర్లు, స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నట్టు సఫారి టీమ్ కెప్టెన్ డు ప్లెసిస్ చెప్పాడు. తాము టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. ముందుగా ఫీల్డింగ్ చేస్తే తమ నలుగురు బౌలర్లకు మంచి ప్రాక్టీస్ అవుతుందని అభిప్రాయపడ్డాడు.
బుమ్రా అరంగ్రేటం
ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. టెస్టుల్లో అరంగ్రేటం చేస్తున్నాడు. కెప్టెన్ కోహ్లి చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడిన బుమ్రా టెస్టుల్లో సత్తా చాటేందుకు బరిలోకి దిగుతున్నాడు. శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యా, అశ్విన్‌లకు తుది జట్టులో చోటు దక్కింది. రాహుల్, రహానే, ఇషాంత్ శర్మలను తీసుకోలేదు.
తుది జట్లు
ఇండియా: కోహ్లి(కెప్టెన్), ధవన్, విజయ్, పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమి, భువనేశ్వర్‌కుమార్, బుమ్రా
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), ఎల్గర్, మక్రామ్, ఆమ్లా, డివిలియర్స్, డీకాక్, ఫిలాండర్, కేశవ్ మహరాజ్, స్టెయిన్, మోర్కల్, రబడ
Comments
Please login to add a commentAdd a comment