జొహన్నెస్‌బర్గ్ పిచ్
దుబాయ్: అనూహ్యమైన బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఒక ఆటాడుకున్న జొహన్నెస్‌బర్గ్ పిచ్‌పై ఊహించినట్లుగానే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టుకు వేదికగా నిలిచిన వాండరర్స్ మైదానాన్ని ‘నాసిరకం’గా గుర్తిస్తూ ఐసీసీ హెచ్చరిక జారీ చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు క్రికెటర్లు పలు మార్లు గాయాలకు గురి కావడంతో అంపైర్లు, రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ‘వాండరర్స్ స్టేడియం పిచ్ నాసిరకంగా ఉందని ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ గుర్తిస్తూ ‘పూర్’ రేటింగ్ ఇచ్చారు.
ఈ పిచ్‌కు మూడు డీ మెరిట్ పాయింట్లు శిక్షగా విధించారు’ అని ఐసీసీ ప్రకటించింది. సాధారణంకంటే తక్కువ ప్రమాణాలతో ఉండే పిచ్‌లకే ఐసీసీ ఒక డీ మెరిట్ పాయింట్ శిక్షగా విధిస్తున్న నేపథ్యంలో మూడు డీ మెరిట్ పాయింట్లు ఇవ్వడం వాండరర్స్ పరిస్థితికి ఉదాహరణ. ఐదేళ్ల వ్యవధిలో డీ మెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరితే ఆ మైదానంలో ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్ జరగకుండా నిషేధం పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment