వెస్టిండీస్ క్రికెట్ జట్టు పేరు మారింది..
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ క్రికెట్ జట్టు పేరు మారింది. ఇన్నాళ్లూ వెస్టిండీస్‌కు పర్యాయపదంగా రాసుకున్న ‘విండీస్’ అనే పేరే ఇప్పుడు అధికారికంగా మారింది. అలాగే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ఇక నుంచి ‘క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ)’గా వ్యవహరించనున్నారు. తమ 91వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మార్పులు జరిగాయి. సరికొత్త మార్పులతో కొత్త అధ్యాయం లిఖిస్తామని బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా విండీస్ బోర్డు సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్ల రెమ్యునరేషన్ గొడవ జట్టు ఎంపికపై ప్రభావం చూపుతోంది. దీంతో వన్డేల్లో ఆటతీరు నానాటికీ క్షీణించి చివరకు చాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది.