20 నిమిషాల్లోనే టిక్కెట్లు క్లోజ్! | World Cup 2015: India-Pakistan Clash Tickets Sold out in 20 minutes | Sakshi
Sakshi News home page

20 నిమిషాల్లోనే టిక్కెట్లు క్లోజ్!

Published Tue, Feb 3 2015 3:35 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

20 నిమిషాల్లోనే టిక్కెట్లు క్లోజ్!

20 నిమిషాల్లోనే టిక్కెట్లు క్లోజ్!

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ ఏదంటే కచ్చితంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించే చెబుతారు. దాయాది జట్లు మరోసారి 'ప్రపంచ' పోరుకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 15న భారత్-పాకిస్థాన్ ఆడిలైడ్ లో ముఖాముఖి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లు 20 నిమిషాల్లో అమ్ముడుపోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

దాదాపు 130 కోట్ల మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయి ఉత్కంఠపోరును వీక్షించనున్నారు. దాయాది జట్ల మధ్య పోరు అంటేనే భావోద్రేకాలు తారాస్థాయికి చేరతాయి. ఇప్పటివరకు ప్రపంచకప్ లో భారత్ పై పాకిస్థాన్ గెలవలేదు. టీమిండియా తన రికార్డు నిలబెట్టుకుంటుందా, పాకిస్థాన్ కొత్త రికార్డు సృష్టిస్తుందా అనేది ఈనెల 15న తేలుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement