పళ్లిపట్టు: డెంగీ సహా వెరైస్ జ్వరాల విజృంభన నేపథ్యంలో నకిలీ డాక్టర్లను ఏరివేసే పనుల్లో జిల్లా వైద్యశాఖ ఉత్సాహం చూపుతున్నది. తిరువళ్లూరు జిల్లాలో గత నెల ప్రబలిన డెంగీ, విష జ్వరాలతో ఇంత వరకు పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పైగా వందలాది మంది జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నకిలీ డాక్టర్ల వైద్యంతోనే ప్రజలకు జ్వరం సమస్య పెరగి ప్రాణాలు కోల్పోతున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించి వెంటనే జిల్లా వ్యాప్తంగా నకిలీ డాక్టర్లను ఏరివేసే పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుందరవల్లి ఆదేశించారు.
దీంతో జిల్లా వైద్యశాఖ అదనపు డెరైక్టర్ మోహన్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం నకిలీ డాక్టర్లను గుర్తించే పనుల్లో నిమగ్నమైయ్యారు. ఇంత వరకు 27 మంది నకిలీ డాక్టర్లను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం పళ్లిపట్టు నగరి రోడ్డు మార్గంలో క్లీనిక్ నిర్వహించే మురళి(38) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టగా పదో తరగతి వరకు మాత్రమే చదువుకుని మూడేళ్ల నుంచి రోగులకు చికిత్స చేస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు.
మురళిని అదుపులోకి తీసుకుని పళ్లిపట్టు పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి నకిలీ డాక్టర్ మురళిని అరెస్ట్ చేశారు. దీంతో ఇంత వరకు 28 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
మరో నకిలీ డాక్టర్ అరెస్ట్
Published Wed, Sep 14 2016 1:22 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement