ముగ్గురు నౌకర్లతో సహా వ్యాపారి హత్య
Published Tue, Aug 20 2013 1:13 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో వివేక్ విహార్‌లో వ్యాపారితో పాటు అతని ముగ్గురు పనివాళ్లు హత్యకు గురయ్యారు. వివేక్ విహార్ ఫేజ్-2 లో 2వ నంబరు ఇంట్లో నివసించే భజ్‌రంగ్‌లాల్ బొకాడియా(66)తో పాటు ఆయన వద్ద పనిచేసే ముగ్గురు వ్యక్తులు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యారు. ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్లో భజ్‌రంగ్‌లాల్ మృతదేహం కుర్చీలో కూర్చున్న భంగిమలో కాళ్లు చేతులు కట్టివేసి ఉంది.నోటికి టేపు అంటించి, గొంతు కోసి ఉంది. డ్రైవరు వినోద్ దూబే40)తో పాటు, వంటమనిషి భోలాసింగ్ (35), మరో నౌకరు ఆనంద్‌కుమార్ (18)ల గొంతులు కోసి ఉన్నాయి. ఇంటి తలుపు కోసిఉంది. ఇంట్లో ససామాన్లు చిందరవందరగా పడిఉన్నాయి’’ అని పోలీసులు తెలిపారు.
భజ్‌రంగ్‌లాల్ దిల్షాద్‌గార్డెన్‌లో ప్లాస్టిక్, రబ్బర్ వ్యాపారం చేసేవాడు. వ్యాపార భాగస్వామి సుభాష్ సేథియా ఉదయం ఎనిమిది గంటలకు భజ్‌రంగ్‌లాల్‌తో మాట్లాడేందుకు ఇంటికి రావడంతో మృతదేహాలు కనిపించాయి. వెంటనే సేథియా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
హత్య జరిగిన సమయంలో వ్యాపారి కుటుంబసభ్యులెవరూ ఇంట్లో లేరని పొరుగువారు చెప్పారు. వ్యాపారి భార్య రాజస్థాన్‌కు వెళ్లిందని, ఆయన కొడుకు, కూతురు ముంబైలో ఉంటారన్నారు. ఇద్దరు నౌకర్లు, డ్రైవరుతో పాటు వ్యాపారి మాత్ర మే ఇంట్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. హత్యలు జరిగినట్లు సమాచారం వ్యాపించడంతో స్థానికులు వందల సంఖ్యలో వ్యాపారి నివాసం ముందు గుమిగూడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హత్యలు జరిగిన వ్యాపారి ఇంటిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ సందర్శిం చారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఢిల్లీలో నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.
హత్యలు జరిగిన తీరు దోపిడీదారుల పనే అని అనే అనుమానాలకు తావిస్తోంది. అయినా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని హంతకుల కోసం గాలిస్తున్నామన్నారు.
Advertisement
Advertisement