జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలి | people opinion on adilabad district | Sakshi
Sakshi News home page

జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలి

Published Sat, Oct 15 2016 10:56 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

people opinion on adilabad district

జిల్లాల విభజన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలని ప్రజలు కోరుతున్నారు. చిన్న జిల్లాలో పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని,  అభివృద్ధి త్వరగా చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు అధిక నిధులు కేటాయించి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఏజేన్సీ ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలు వారి మాటల్లోనే.       
  - బజార్‌హత్నూర్ /తలమడుగు/బేల/ ఆదిలాబాద్ రూరల్ /గుడిహత్నూర్
 
 జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
 రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాను నాలుగు ముక్కలు చేసింది.  ఆదిలాబాద్ జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. జిల్లాలోని అభివృద్ధి ప్రాంతాలైన మంచిర్యాల, నిర్మల్, ఆసిపాబాద్‌లను ప్రత్యేక జిల్లాలను చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం నాలుగు జిల్లాలను చేయడం సంతోషకరమైనప్పటికీ జిల్లాను అభివృద్ధి చేయడంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
 - మ్యాకల లింగన్న యాదవ్ , బజార్‌హత్నూర్   
 
పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
జిల్లాను అభివృద్ధి చేసేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని అధిక నిధులు కేటాయించి జిల్లాను అభివృద్ధిలో ముందుంచాలి. ప్రజలను జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి అధికారులు అందుబాటులో ఉండాలి. చిన్న జిల్లాలో అభివృద్ధి వేగాన్ని పెంచాలి. జిల్లాను అన్ని రంగాలలో ముందు ఉంచేందుకు కృషి చేయాలి.
 -  శ్రీనివాస్‌రెడ్డి,తలమడుగు
 
జిల్లాను అభివృద్ధి చేయాలి
ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయడం బాధాకరమే.  అయినప్పటికీ ప్రతి జిల్లాకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. చిన్న జిల్లాలకు ఒక ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ స్థాయి అధికారి రావాలంటే వెనుకడుగు వెసే అవకాశాలు ఉంటాయి. గతంలో ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడ్డ జిల్లా అనే వారు. దీన్ని నలుగు ముక్కలు చేయడంతో ప్రజల్లో నిరాశ కలుగుంది. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి. మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే కొంత జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
 - వెంకటి, తంతోలి
 
పర్వాలేదు..
ఆదిలాబాద్ మండలాన్ని మూడు మండలాలు చేసే బదులు రెండు మండలాలుగా ఏర్పాటు చేస్తే బాగుండేది. ప్రస్తుతం ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసినా జిల్లాలకు, డివిజన్‌లకు, మండలాలకు  అర్థం ఉంటుంది. ప్రజలకు సేవలు అందకపోతే లాభం ఉండదు.
 - శైలేందర్,చాంద-టి
 
గుర్తింపు అందించాలి
ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం అభినందనీయం. ఒకేసారి ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాఏమో.. దశల వారీగా ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉండేవి. ఏదీ ఏమైనా అభివృద్ధి పరంగా అన్నీ జిల్లాలకు ప్రాధాన్యతను అందించాలి. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యులు కావాలి.
 - అసుర రమేష్, లాండసాంగ్వి(ఆదిలాబాద్ రూరల్ )
 
క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా..
సుపరిపాలన సౌలభ్యం కోసం ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించడం మంచిదే.ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో పాటు కోమురం భీం జిల్లా పేరు పెట్టడం సరైనది. ఉట్నూర్ ప్రాంతాన్ని ఆసిఫాబాద్ జిల్లాలోనే కలిపితే ఇంకా బాగుండేది. ఏదీ ఏమైనా కొన్ని మండలాలలో జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లా కేంద్రానికి దూరం తగ్గడం, అన్ని విధాలుగా సౌలభ్యంగా మారింది. ఇకముందు మన తెలంగాణ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికి అందే విధంగా క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా చూడాలి.
 - కంది శ్రీనివాస్ రెడ్డి, రైతు చప్రాల బేల మండలం
 
పారిశ్రామికంగా అభివృద్ధి పర్చాలి
ఆదిలాబాద్ జిల్లా పత్తి సాగుకు పేరుగాంచింది. అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు జిల్లా నేలలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని పత్తి పరిశ్రమలు, పత్తి బేళ్ల ఉత్పత్తికి ఆసియా ఖండంలోనే పేరుగాంచాయి. నేడు పరిస్థితి దయనీయంగా ఉంది. పాత పరిశ్రమలు పునురుద్ధరించి కొత్త పరిశ్రమలు నెలకొల్పాలి. అప్పుడే అనుబంధ రైతులకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.
 -  కస్తూరి దేవ్‌రాజ్, జేఏసీ కన్వీనర్ గుడిహత్నూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement