ఆత్మాహుతి యత్నం
మద్రాసు వర్సిటీలో ఉద్రిక్తత
గంటన్నర సాగిన హైడ్రామా
సాక్షి, చెన్నై: మద్రాసు వర్సిటీలో ఓ విద్యార్థి బుధవారం కలకలం సృష్టించారు. వర్సిటీ భవనంపై అంతస్తుకు చేరి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే యత్నం చేశాడు. ఉత్కంఠ భరిత వాతావరణంలో గంటన్నర పాటుగా సాగిన హైడ్రామాకు పోలీసులు ముగింపు పలికారు. మద్రాసు వర్సిటీలో ఇటీవల కొం దరు విద్యార్థుల తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. వీరికి మణివన్నన్ అనే ప్రొఫెసర్ అండగా నిల బడారని చెప్పవచ్చు. అయితే, వీరి ఆందోళనను తీవ్రంగా పరిగణించిన వర్సిటీ వర్గాలు పది మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఆ ప్రొఫెసర్‌పై చర్యలు సైతం తీసుకున్నారు. అయితే, తమ డిమాండ్ల కోసం ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా..? అంటూ వర్సిటీ వర్గాలను విద్యార్థులు నిలదీశారు.
వారి నుంచి స్పందన కరువు కావడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం విద్యార్థులకు అండగా నిలబడ్డా, వారిని మళ్లీ వర్సిటీలోకి చేర్చుకునేందుకు అధికారులు చర్యలు చేపట్ట లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సస్పెండ్ కాబడ్డ వారిలో ఒకరైన రాజ్‌కుమార్ అనే వి ద్యార్థి ఆత్మాహుతి యత్నానికి సిద్ధమయ్యాడు. వర్సిటీ వర్గాల కళ్లు గప్పి, బహుళ అంతస్తుతో కూడిన ప్రధాన భవనం పైకి ఎక్కేశాడు. చేతిలో పెట్రోల్ క్యాన్, అగ్గి పెట్టెను పట్టుకుని ఆత్మాహుతి చేసుకోబోతున్నట్టు ప్రకటించా డు. దీంతో ఆ పరిసరాల్లో కలకలం బ యలు దేరింది. ఆ వర్సిటీలోని విద్యార్థు లు, అధికారులు అక్కడికి ఉరకలు తీసి, అతడ్ని వారించే యత్నం చేశారు.
విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తి వేయాల్సిందేనని లేని పక్షంలో తాను ఆత్మాహుతికి సిద్ధం అని పదే పదే రాజ్‌కుమార్ హెచ్చరించడం మొదలెట్టాడు. దీంతో పోలీ సుల్ని రంగంలోకి దించారు. అగ్నిమాపక సిబ్బంది ఆ భవనం మీదకు చేరుకుని అతడ్ని వారించే యత్నం చేశారు. తనను అగ్నిమాపక సిబ్బంది సమీపించడంతో ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే యత్నం చేశాడు. దీంతో ఆ సిబ్బంది వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఆ భవనం మీద నుంచి కిందకు దిగేయక తప్పలేదు. అదే సమయంలో అక్కడి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు , సహచర విద్యార్థులు రాజ్‌కుమార్‌ను వారించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. అతడి డిమాండ్ మీద వర్సిటీ వర్గాలతో చర్చించే పనిలో పడ్డారు. అంత వరకు సంయమనం పాటించాలని రాజ్‌కుమార్‌కు సూచించారు.
ఈ చర్చలు సాగుతున్న సమయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాక చక్యంగా వ్యవహరించి మరో మార్గంగుండా ఆ భవనంపైకి చేరుకుని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గంట సేపుగా తీవ్ర ఉత్కంఠ, కలకలాన్ని సృష్టించిన రాజ్‌కుమార్ మీదున్న కోపంతో పోలీసులు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అతడ్ని తమ వ్యాన్‌లో పడేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లే యత్నం చేయడం వివాదానికి దారి తీసింది. ఆ వ్యాన్‌కు అడ్డంగా అక్కడి విద్యార్థులు కూర్చోవడంతో, పోలీసులు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. చివరకు రాజ్‌కుమార్‌ను లోనికి తీసుకెళ్లి వర్సిటీ వర్గాల ద్వారా పోలీసులు సంప్రదింపులు, చర్చలు సాగించారు. గంటకు పైగా సాగిన ఈ హైడ్రామాకు పోలీసుల ఒత్తిడితో తెర పడింది. చర్చల అనంతరం విద్యార్థుల సస్పెండ్ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ వర్సిటీ యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఆత్మాహుతి యత్నం హైడ్రామా సుఖాంతమైంది.
కలకలం రేపిన విద్యార్థి
Published Thu, Jan 14 2016 1:51 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement